Use Electric Lamps and Lights in the Prayer Room: సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దేవుని ముందు నూనె లేదా నెయ్యి దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అయితే, ఈ దీపాలు కొంత సమయం తర్వాత ఆరిపోతుంటాయి. ఇలా దీపం ఆరిపోయిన తర్వాత దేవుని గది చీకటిగా ఉండటం మంచిదేనా? ఆ సమయంలో విద్యుత్ దీపాలను ఉపయోగించవచ్చా? అన్న సందేహాలకు పండితులు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

దీపంతో పాటు విద్యుత్ వెలుగు ఎందుకు?

దైవ మందిరంలో నూనె దీపంతో పాటు ఒక చిన్న విద్యుత్ బల్బు నిరంతరం వెలుగుతూ ఉండటం చాలా శుభప్రదం నూనె దీపం ఆరిపోయినా, విద్యుత్ దీపం ద్వారా దేవుని గదిలో నిరంతరం వెలుగు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, దేవుని సన్నిధి ఎప్పుడూ కాంతివంతంగా ఉండాలి.

సానుకూల శక్తి: వెలుగు ఉన్న చోట సానుకూల శక్తులు ప్రవహిస్తాయి. రాత్రిపూట ఇల్లు పూర్తిగా చీకటిగా ఉండటం అశుభ సూచకమని, అది సొంత ఇల్లయినా, అద్దె ఇల్లయినా కనీసం హాలులో లేదా పూజా గదిలో వెలుగు ఉండాలని ఆయన సూచించారు.

శాస్త్రీయ - ఆచరణాత్మక కోణం

దేవుని గదిలో బల్బు ఉండటం వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి:

ప్రమాదాల నివారణ:

రాత్రిపూట నీళ్లు తాగడానికో లేదా ఇతర అవసరాలకో నిద్రలేచినప్పుడు, ఇల్లు పూర్తిగా చీకటిగా

ఉంటే వృద్ధులు, పిల్లలు దేనికైనా తగిలి గాయపడే ప్రమాదం ఉంది. మసక వెలుతురు ఇచ్చే చిన్న బల్బు ఉంటే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు.

మానసిక చైతన్యం:

గాఢాంధకారంలో నిద్రలేవగానే మనసులో ఒక రకమైన భయం లేదా అభద్రతా భావం కలగవచ్చు. అదే చిన్న వెలుగు కనిపిస్తే మనసులో చైతన్యం, శాంతి కలుగుతాయి.

వాస్తు - భక్తి

దేవుని మందిరంలో నిరంతరం వెలుగు ఉండటం వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ సానుకూల ప్రకంపనలతో నిండి ఉంటుందని వాస్తు నిపుణుల అభిప్రాయం. నూనె దీపం భక్తికి ప్రతీక అయితే, విద్యుత్ దీపం ఆ వెలుగు నిరంతరం కొనసాగేలా చూసే ఒక ఆచరణాత్మక మార్గం.

Tags: