Sankranti Really Means: సంక్రాంతి అంటే ఏంటో మీకు తెలుసా?
మీకు తెలుసా?
Sankranti Really Means: సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.
దాదాపు మన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా వస్తుంటాయి. అందుకే క్యాలెండర్‌లో ఆ పండుగల తేదీలు మారుతుంటాయి. కానీ సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి ఏడాది ఒకే సమయంలోమకర రాశిలోకి ప్రవేశిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఈ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే జనవరి 14/15 తేదీలలోనే సంక్రాంతి వస్తుంది. ఇది ఖగోళ మార్పులకు సంబంధించిన పండుగ కాబట్టి తేదీల్లో మార్పు ఉండదు.
సంక్రాంతి పండుగ వేళ కోడిపందేల సందడి మొదలు కానుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉబయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో బరుల ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో పందేలకు ఏర్పాట్లు చేస్తుండగా, వారిని కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెంచారు. అయినా నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. కోట్ల రూపాయల పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో ఉండే హోటళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.