Tallapaka Brahmotsavams: టిటిడి అనుబంధనంగా ఉన్న అన్నమయ్య జిల్లా నందలూరు, తాళ్లపాకలోని ఆలయాలలో జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నందలూరు, తాళ్లపాకలలో పరిశీలించారు.

అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుండి 13వ తేదీ వరకు, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయన్నారు. ఈ సందర్భగా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీన, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 05న అంకురార్పణ జరుగనుందన్నారు. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.

తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో, శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ శివప్రసాద్, శ్రీమతి ప్రశాంతి, డిఎఫ్వో శ్రీ ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణులు శ్రీ రాముడు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: