Finding Gold: బంగారం దొరికితే అదృష్టమా..? పోతే దురుదృష్టమా..? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?

దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?

Update: 2025-09-16 06:03 GMT

Finding Gold: బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతీ ఒక్కరు బంగారం కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం బంగారం రూ.లక్ష దాటింది. కానీ బంగారం దొరికితే అదృష్టం, పోగొట్టుకుంటే దురదృష్టం అని అంటారు. కానీ అది సరైంది కాదని పండితులు అంటున్నారు. బంగారం కోల్పోవడం లేదా దొరకడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగారం - ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

బంగారం బృహస్పతి గ్రహంతో ముడిపడి ఉంది. దీని పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. పెద్దలు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బంగారం ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. అందుకే దేవతల విగ్రహాలపై ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

బంగారం కోల్పోవడం - ఇది శుభమా, అశుభమా?

బంగారం పోగొట్టుకోవడం అశుభంగా పరిగణిస్తారు. ఇది ప్రతికూల శక్తులు ఉన్నాయనడానికి సూచన.

మీ వంశ దేవుడు, ఇంటి దేవుడు లేదా ఇష్ట దైవం అనుగ్రహం లేదని దీని అర్థం.

మీరు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని దీని ద్వారా గ్రహించాలి.

శని, రాహువు, కేతువు వంటి గ్రహాల ప్రభావం కూడా దీనికి కారణం కావచ్చు.

బంగారం దొరకడం - అదృష్టమా.. అప్రమత్తంగా ఉండాలా?

మీకు ఎక్కడైనా బంగారం దొరికితే అది అదృష్టంగా భావించినా, దాన్ని ఎలా ఉపయోగించాలనేది చాలా ముఖ్యం.

వెంటనే దాన్ని ఆభరణాలుగా మార్చుకోవడం లేదా అమ్మేయడం సరైంది కాదు.

దొరికిన బంగారాన్ని శుద్ధి చేసి, సురక్షితంగా మీ లాకర్‌లో ఉంచుకోవడం మంచిది.

లేదా దాన్ని దానధర్మాలు చేయడానికి ఉపయోగించవచ్చు.

బంగారం కోల్పోయినా, దొరికినా మనం దానిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ సంఘటనల వెనుక మన జీవితంలో ఏదో ఒక మార్పు రాబోతుందనడానికి సంకేతాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మీరు కూడా ఈ విషయాలను గమనించి మీ జీవితాన్ని మరింత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Tags:    

Similar News