Srisailam Shivaratri Brahmotsavams: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా 15 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో సుమారు 30 లక్షల లడ్డూలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ఉత్సవాల ప్రారంభం. ఫిబ్రవరి 15 (మహాశివరాత్రి): లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం. ఫిబ్రవరి 16న మల్లికార్జున స్వామి , అమ్మవారి రథోత్సవం జరుగుతుంది.

ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వచ్చే భక్తుల వాహనాలకు టోల్ ఫీజు ఉండదు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో భక్తులకు నిరంతరం మజ్జిగ, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశారు.కాలినడకన వచ్చే భక్తుల కోసం అటవీ మార్గంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.: రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వీలైనంత త్వరగా దర్శనానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.

Tags: