Good News for Tirumala Devotees:తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. సంస్కరణలపై ఈవో సమీక్ష

సంస్కరణలపై ఈవో సమీక్ష;

Update: 2025-07-12 04:45 GMT

Good News for Tirumala Devotees: భక్తుల సౌకర్యార్థం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్&టీ సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఈవో శ్రీ జే.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా సదుపాయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇంటిగ్రాటెడ్ సర్వేలన్స్ సిస్టం, కామన్ అలారం మానేజ్మెంట్ సిస్టం, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ & క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలను ఈవోకు సవివరంగా వివరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అదే విధంగా దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక ప్రణాళికలు రూపొందించాలని L&T ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్య నారాయణ, L&T ప్రతినిధుల నిపుణుల బృందం, ట్రాన్స్ పోర్ట్ మరియు IT జీఎం శ్రీ శేషారెడ్డి, ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, శ్రీమతి సదా లక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News