Parveti Utsavam: తిరమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

పార్వేట ఉత్సవం;

Update: 2025-07-04 15:21 GMT

Parveti Utsavam: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని శ్రీవారి మెట్టు సమీపంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు . ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మరోవైపు తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు కనిపించింది. ఏనుగులు వాహనదారుల దగ్గరికి రావడంతో భయంతో వణికిపోయారు. వాహనదారులు సమాచారం మేరకు టిటిడి సిబ్బంది. అటవీ శాఖ అధికారులు అక్కడి చేరుకొని పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతంలోని తరిమేశారు. 

Tags:    

Similar News