Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

Update: 2025-11-22 06:24 GMT

Sri Padmavathi Ammavari Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్ర‌వారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ , ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News