Guru Pounami : భావాతీత ధ్యానం గురించి జ్ఞానం కల్పించిన గురువు వ్యాస మహర్షి
గురువు ప్రాతః స్మరనీయుడు. పూజ్యుడు;
గురు పౌర్ణమిని, వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు, ఈ రోజు వ్యాస మహర్షి జన్మదినంగా సైతం భావిస్తారు. ఈ పవిత్ర రోజు గురించి శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద, సనత్కుమార ఉపనిషత్తులో వివరంగా ప్రస్తావించారు. వ్యాస మహర్షి జ్ఞాన ప్రదాత. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు... సర్వ జ్ఞాన సౌజన్యుడు. ఈ రోజుల్లో మనం చదివి ఎన్నో ఉత్కృష్టమైన విషయాలు కలిగిఉన్న మహాభారతం వ్యాసమహర్షి రాసిందే. అష్టాదశ పురాణాలను కూడా వ్యాసమహర్షి రాసినవే. మహా భారతంలో వివరించిన శృంగధనువు, బ్రహ్మాస్త్రo నారాయణజ్వరo....సుదర్శనచక్రం తో సహా ఇతర భీకర అస్త్రాల గురించి వివరించాడు ఆ రుషి. సుదర్శన చక్రం దేవశిల్పి విశ్వకర్మచే తయారుచేయబడిoది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేశాడని వ్యాసముల వారే రాశారు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోవడంతో విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు. ఒకటి పుష్పక విమానం, రెండవది పరమశివుని త్రిశూలం, మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం. ఈ నిర్మాణాలనీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవే. మహాభారతంలో ప్రస్తావించిన ఆయుధాలు వాటి తయారీ గురించిన జ్ఞానం వ్యాస రచనల వల్లే తెలుస్తోంది. జెర్మనీ కి చెందిన ఎంతోమంది సైంటిస్టులు వేదాలను దొంగిలించారని తెలుస్తోంది. భావాతీత ధ్యానం గురించి వ్యాస మహర్షి జ్ఞానం కల్పించిన గురువు వ్యాసుడేనని దేశదేశాలవారు అంగీకరించారు. ఈ నిర్మాణాలనీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవే.
విజ్ఞానం అంటే పరిజ్ఞానం లేదా జ్ఞానం అని అర్థం. ఇది శాస్త్రీయ పద్ధతుల ద్వారా పొందిన సమాచారం లేదా అవగాహన. విజ్ఞానం అనేది కొత్త విషయాలను తెలుసుకోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి సహాయపడుతుంది. ఇది జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరమైoది. విజ్ఞానం సహాయంతో, వ్యక్తులు సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలను కనుగొనవచ్చు. వైద్యులు వ్యాధులను నయం చేయడానికి విజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. నేడు మనిషి అంతరిక్షాన్ని చుట్టుముట్టి తిరిగి వస్తున్నాడు. భవిష్యత్తులో ఈ లోకానులోకాల్లో మనం ఒంటరివాళ్ళం కామని నిరూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగీత సారస్వతం మొత్తం తెలిసిన త్యాగయ్యకు స్వరార్ణవం అనే గ్రంధాన్ని అందించిన నారదుడు నివసించే స్థానం మకరరాశి లో ఉందట. ఆయన భూమిమీదకు రావడానికి అవసరమైన స్వచ్ఛమైన ప్రాణ వాయువు ఇక్కడ లభ్యం కావడం లేదని వెయిర్డ్స్ థింగ్ ఐ లెర్న్డ్ అనే ఆంగ్ల మాస పత్రికలో రాశారు. ఆయనను గ్రహాంతరవాసి అని అంటున్నారు. అందుకే నారదుడు ఇప్పుడు భూమి మీదకు రావడం మానేశాడంటారు. పూర్వం రుషులందరూ శాస్త్రజ్ఞులు. వారు వివరించిన గొప్ప జ్ఞానం వల్లే మనం ప్రగతి సాధిస్తున్నాం. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఒక జ్ఞాన బాండాగారం. అందుకే ఆయనను కృష్ణం వన్డే జగద్గురు: అని పూజిస్తున్నాం. విజ్ఞానం కొత్త సాంకేతికతలు, ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఇది సమాజం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. పంచే కొద్దీ పెరుగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ (శాస్త్రం, జ్ఞానంల) కలయికతో ఏర్పడిందే విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని మానవాళికి అందించిన వారందరూ గురువులే. గురువు సృజన కారకుడైన బ్రహ్మతో సమానం (గురుర్బ్రహ్మ) సకల దేవతలతో సమానమైనవాడే గురువు. గురువుకు నమస్కరించాలి. గురువు ప్రాతః స్మరనీయుడు. పూజ్యుడు.
--అప్పరుసు మనోజ్ కశ్యప్