Jupiter’s Double Transit on October 31: అక్టోబర్ 31న గురుడి డబుల్ ట్రాన్సిట్.. ఒకేరోజు రాశి, నక్షత్ర మార్పుతో ఈ 3 రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
Jupiter’s Double Transit on October 31: నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే బృహస్పతి జ్ఞానం, సంపద, సంతాన సౌభాగ్యం, వివాహం, ఆధ్యాత్మికతకు కారకుడు. ధనుస్సు, మీన రాశులకు అధిపతి అయిన గురుడు సాధారణంగా ఒక్కో రాశిలో ఏడాది పాటు సంచరిస్తాడు. అయితే ప్రస్తుతం గురుడు తన విశిష్ట గతి కారణంగా తక్కువ వ్యవధిలోనే రాశి మార్పులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో అక్టోబర్ 31న ఒక అరుదైన ఖగోళ పరిణామం చోటుచేసుకోనుంది. గురు గ్రహం ఒకే రోజున అటు రాశిని, ఇటు నక్షత్రాన్ని మార్చుకోనుంది. ప్రస్తుతం కర్కాటక రాశి, ఆశ్లేష (అయిల్యం) నక్షత్రంలో ఉన్న బృహస్పతి.. అక్టోబర్ 31న సింహ రాశిలోని మఖ (మకం) నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. గురుడి ఈ అసాధారణ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
కుంభ రాశి: వైవాహిక బంధం బలోపేతం.. వ్యాపారంలో భారీ లాభాలు..
కుంభ రాశి వారికి గురుడు సప్తమ భావంలో (7వ ఇల్లు) సంచరించనున్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, సమస్యలు సమసిపోయి అనుబంధం బలపడుతుంది. సంయుక్తంగా వ్యాపారం చేసే వారికి విశేషమైన లాభాలు అందుతాయి. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు పరిష్కారమై ఊరట లభిస్తుంది.
సింహ రాశి: లగ్నంలో గురుడు.. ఆత్మవిశ్వాసంతో విజయాలు..
సింహ రాశిలోని మొదటి ఇంట్లోకి గురుడు ప్రవేశించనుండటం ఈ రాశి వారికి అత్యంత లాభదాయకం. వృత్తిపరంగా ఎదుర్కొన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఉన్నత పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా ఊహించని గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ అనుకూల ఫలితాలు వస్తాయి. పిల్లలు చదువు, కెరీర్లో సాధించే విజయాలు కుటుంబంలో ఆనందాన్ని నింపుతాయి. మీలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
మేష రాశి: పంచమ స్థానంలో బృహస్పతి.. పేరుప్రతిష్టలు రెట్టింపు
మేష రాశి వారికి పంచమ భావంలో గురుడి సంచారం జరగనుంది. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారవేత్తలకు లాభసాటి నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదరణ పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించి మనశ్శాంతి చేకూరుతుంది.