Ketu Transit 2026: కేతు సంచారం 2026: ఈ మూడు రాశుల వారు జరభద్రం.. మార్చి వరకు గడ్డు కాలమే..?
మార్చి వరకు గడ్డు కాలమే..?
Ketu Transit 2026: జ్యోతిష్య గణాంకాల ప్రకారం.. కేతు వు సాధారణంగా ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారుతుంటాడు. అయితే జనవరి 25, 2026న కేతువు పునర్వ సు నక్షత్రం యొక్క రెండవ పాదం నుండి మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. మార్చి 29 వరకు కేతువు ఇదే స్థితిలో కొనసాగుతాడు. ఈ నక్షత్ర మార్పు ప్రభావం కారణంగా ఈ మూడు రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ కేతు సంచారం కొంత కష్టతరంగా ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు లభించకపోవడంతో మానసిక నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అప్పులు లేదా పాత బాకీల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబంలో లేదా వైవాహిక జీవితంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం.
తుల రాశి
తులా రాశి వారికి ఇది ఒక రకమైన పరీక్షా సమయం అని చెప్పవచ్చు. మార్చి వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఉన్న ఉద్యోగాన్ని వదలడం వంటి నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. స్టాక్ మార్కెట్ లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు.
మీన రాశి
మీన రాశి వారికి కేతువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఊహించని వైద్య ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. మార్చి నెలాఖరు వరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వ్యాపారస్తులు భాగస్వాములతో చర్చించేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని మిగిల్చవచ్చు.
పరిహారాలు: దోష నివారణకు ఏం చేయాలి?
కేతువు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి జ్యోతిష్యులు కింది సూచనలు చేస్తున్నారు:
గణపతి ఆరాధన: కేతు దోష నివారణకు వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. సంకటహర చతుర్థి రోజున గరికతో పూజ చేయాలి.
దానం: పేదలకు దుప్పట్లు లేదా నలుపు, తెలుపు రంగులు కలిసిన వస్త్రాలను దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.
మంత్ర జపం: ప్రతిరోజూ "ఓం కేతవే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
గ్రహ సంచారాలు మన జీవితంపై ప్రభావం చూపినప్పటికీ, అప్రమత్తత, దైవచింతనతో కష్టకాలం నుండి సులభంగా బయటపడవచ్చు.