Telangana Police Regarding Wearing Ayyappa Mala: అయ్యప్ప మాల వేసుకుంటే.. తెలంగాణ పోలీస్ శాఖ కీలక ఆదేశాలు

తెలంగాణ పోలీస్ శాఖ కీలక ఆదేశాలు

Update: 2025-11-25 08:07 GMT

Telangana Police Regarding Wearing Ayyappa Mala: తెలంగాణ పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు దీక్షలు చేపడితే సెలవులు తప్పనిసరి అని వెల్లడించింది. డ్యూటీలో ఉండగా మాత్రం ఎలాంటి దీక్షలు చేపట్టొద్దని ఆదేశాల్లో పేర్కొంది. పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోకూడదంది. అయ్యప్ప మాల వేసుకున్న ఓ SIకి మెమో కూడా జారీ చేసింది. పర్మిషన్ తీసుకోకుండా మాల వేసుకుని, నల్ల బట్టలు ధరించి.. గడ్డం పెంచుకున్నాడని కాంచన్ బాగ్ SI కృష్ణకాంత్‌కు మెమో జారీ చేశారు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్.

అయితే ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హిందువులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అని ప్రశ్నించారు. రంజాన్ సమయంలో ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ముస్లిం పోలీసులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని రాజాసింగ్ అడిగారు. అయ్యప్ప దీక్ష సమయంలోనే పోలీసులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు రాజాసింగ్.

Tags:    

Similar News