Saturn to Enter Aries After 29 Years: 29 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి శని దేవుడు.. 2027 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం..
తిరుగులేని అదృష్టం..
Saturn to Enter Aries After 29 Years: జ్యోతిష్య శాస్త్రంలో న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మకర, కుంభ రాశులకు అధిపతి అయిన శని.. ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు నెమ్మదిగా సంచరిస్తాడు. ఫలితంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఆయన ప్రభావం సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది. ప్రస్తుతం మీనరాశిలో కొనసాగుతున్న శని దేవుడు 2026 సంవత్సరం మొత్తం అక్కడే ఉంటాడు. ఆ తర్వాత 2027 జూన్ 3 వరకు మీనంలోనే ఉండి, అనంతరం కుజుడి అధిపత్యంలోని మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. గతంలో 1998లో మేషరాశిలో సంచరించిన శని, దాదాపు 29 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. మేషం శనికి నీచ క్షేత్రం అయినప్పటికీ, నిజాయితీగా, కష్టపడే స్వభావం గలవారికి శని ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే అందిస్తాడు. ముఖ్యంగా 2027లో జరిగే ఈ భారీ గ్రహ మార్పు నాలుగు రాశుల వారికి అపారమైన ధనలాభాలు, కెరీర్ పురోగతిని అందించనుంది.
కర్కాటక రాశి
2027 నాటి శని సంచారం కర్కాటక రాశి వారికి విశేషమైన అదృష్టాన్ని తీసుకురానుంది. ఆర్థిక పరిస్థితులు ఊహించని విధంగా మెరుగుపడతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆఫీసులో గుర్తింపు లభిస్తాయి. కెరీర్లో సరికొత్త పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. కొందరికి విదేశీ ప్రయాణాలు లేదా విదేశాల్లో స్థిరపడే అవకాశాలు సులభంగా కలిసివస్తాయి.
తులా రాశి
తులారాశి వారికి శని సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలను అందించనుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి భారీ లాభాలను అందించే సరికొత్త ఒప్పందాలు (కాంట్రాక్టులు) అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని రిటర్న్స్ వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. చాలా కాలంగా నిలిచిపోయిన కీలక పనులు వేగంగా పూర్తవుతాయి.
మకర రాశి
శని స్వక్షేత్రమైన మకర రాశి వారికి ఈ సంచారం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు అనువైన అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి, మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ కాలం అనేక సానుకూల మార్పులను, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. చాలా కాలంగా మనసులో ఉన్న పెద్ద ఆశయాలు, కలలు సాకారమవుతాయి. శత్రువులపై సంపూర్ణ విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గతంలో చిక్కుకుపోయిన లేదా రావాల్సిన పాత బాకీలు చేతికి అంది ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.