September Festivals 2026: కాల గమనంలో మరో నెల మన ముందుకు వచ్చేసింది.ఆగస్ట్ ముగిసి, ఎంతో పవిత్రమైన, పండుగలతో కళకళలాడే సెప్టెంబర్ 2026 మనల్ని పలకరిస్తోంది. ఈ నెలలో ఏ రోజు ఏ పండుగ వస్తోంది? వాటి ప్రాముఖ్యత ఏంటి? అనే పూర్తి ఆధ్యాత్మిక విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం

సెప్టెంబర్ 1, 2 తేదీల్లో.. సంకష్టహర చతుర్థి, శ్రావణ మంగళగౌరీ వ్రతంతో పాటు శ్రీకృష్ణుని సోదరుడైన బలరామ జయంతి.. అంటే హల షష్ఠి పర్వదినాలు వచ్చాయి. ఇక సెప్టెంబర్ 4న భక్తిశ్రద్ధలతో కొలిచే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మరుసటి రోజు.. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు, కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉట్టి కొట్టే వేడుకలు.. అంటే దహీ హండీ సందడి అంబరాన్ని తాకనుంది.

సెప్టెంబర్ 11న శ్రావణ మాసానికి ముగింపు పలుకుతూ పోలాల అమావాస్య వచ్చింది. ఆ తర్వాత భాద్రపద మాసం ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 14న సర్వవిఘ్న నివారకుడు వినాయకుడు కొలువయ్యే పండుగ.. వినాయక చవితి ఎంతో వైభవంగా ప్రారంభమవుతుంది! ఇదే రోజు మహిళలు స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.సెప్టెంబర్ 15న ఋషి పంచమి, సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి, కన్య సంక్రాంతి ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ 19న శ్రీకృష్ణుడి ప్రియ భార్య రాధారాణి జన్మదినం.. రాధా అష్టమితో పాటు మహాలక్ష్మి వ్రతాలు ప్రారంభమవుతాయి

సెప్టెంబర్ 23న కేరళ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే ఓనం పండుగతో పాటు వామన జయంతి వస్తోంది. ఇక సెప్టెంబర్ 25న గణేష్ నిమజ్జనం, అనంత చతుర్దశి వేడుకలతో గణపతి నవరాత్రులు ముగుస్తాయి. సెప్టెంబర్ 26న భాద్రపద పౌర్ణమి, ఉమామహేశ్వర వ్రతం ఉండగా.. చివరి వారంలో మన పూర్వీకులను స్మరించుకునే పితృ పక్షాలు ప్రారంభమవుతాయి.

Tags: