Shani Nakshatra Transit 2026: శని నక్షత్ర సంచారం 2026.. ఈ 3 రాశుల వారికి ఇక అదృష్టమే..
ఈ 3 రాశుల వారికి ఇక అదృష్టమే..
Shani Nakshatra Transit 2026: గ్రహాల్లో అత్యంత కీలకమైన శని దేవుడు ఒక రాశిలో రెండున్నర ఏళ్ల పాటు ఉంటాడు. అయితే రాశితో పాటు ఆయన నక్షత్ర సంచారం కూడా మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శని భగవానుడు, ఇవాళ జనవరి 20, మధ్యాహ్నం 12:13 గంటలకు తన స్వంత నక్షత్రమైన ఉత్తర భాద్రపదలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల మూడు రాశుల వారికి అపారమైన అదృష్టం వరించబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం:
మకర రాశి
మకర రాశికి అధిపతి శని దేవుడే కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటక రాశి
శని సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలకు లాభాల పంట పండుతుంది. కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది. ఆస్తి లేదా భూమికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
మిథున రాశి వారికి శని దేవుడి ఆశీస్సులతో అదృష్టం తోడవుతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు లాభం చేకూరుతుంది. కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
పరిహారాలు
శని ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ, మరింత శుభ ఫలితాల కోసం శనివారం నాడు శని చాలీసా పఠించడం లేదా పేదలకు నల్ల నువ్వులు, నూనె దానం చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.