Sri Govindaraja Swamy Brahmotsavam: ధ్వజావరోహణంతో సంపూర్ణమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవ మహోత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవ మహోత్సవం

Update: 2026-06-01 10:17 GMT

Sri Govindaraja Swamy Brahmotsavam: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణ ఘట్టంతో విజయవంతంగా ముగిశాయి.

రాత్రి 8.40 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం ద్వారా ఆహ్వానించిన సకల దేవతలను గరుడ పటాన్ని అవనతం చేసి ఘనంగా సాగనంపారు.

బ్రహ్మోత్సవ దర్శన మహిమ

బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని సేవించిన భక్తులు సమస్త పాపాల నుండి విముక్తి పొంది, ఆయురారోగ్యాలు, ధనధాన్య సమృద్ధి, సకల శుభఫలాలను పొందుతారని ఆగమ, పురాణాలు విశదీకరిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News