Sri Saumyanatha Swamy: సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై విహరించిన శ్రీసౌమ్యనాథ స్వామి
విహరించిన శ్రీసౌమ్యనాథ స్వామి;
Sri Saumyanatha Swamy: అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీసౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 10వ తేదీ గురువారం ఉదయం 08.00 గం.లకు సూర్య ప్రభ వాహనంపై, రాత్రి 07.00 గం.లకు చంద్ర ప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 05.00 గం.లకు స్వామివారికి డోలోత్సవము నిర్వహించారు.
జూలై 11న కల్యాణోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 11వ తేదీ ఉదయం 10.00 – 12.00 గం.ల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. రాత్రి 07.00 గం.లకు గజ వాహనంపై స్వామి వారు విహరిస్తారు.
నంది వాహనంపై శ్రీ సిద్ధేశ్వరస్వామివారు
తాళ్ళపాక సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 08.00 గం.లకు పల్లకీ సేవ, సాయంత్రం 06.00 – 07.00 గం.లకు నంది వాహనంపై స్వామి వారు ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
జూలై 11న కల్యాణోత్సవం
జూలై 11న సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. రాత్రి 07.30 గం.లకు గజ వాహనంపై భక్తులను స్వామివారు ఆశీర్వదించనున్నారు.
గరుడ వాహనంపై శ్రీ చెన్నకేశవస్వామివారు.
తాళ్ళపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో జూలై 10న ఉదయం 09.00 గం.లకు మోహినీ అవతారం, రాత్రి 07.00 గం.లకు గరుడ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించారు.
జూలై 11వ తేదీ ఆర్జిత కల్యాణోత్సవం
జూలై 11వ తేదీ సాయంత్రం 6 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తులను ఆకట్టుకునేలా హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ శ్రీ వై. హనుమంతయ్య, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ డి. బాలాజీ, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.