Srivari Pushkarini: ఆగస్టు 01 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు

పుష్కరిణి మరమ్మతులు

Update: 2026-07-25 11:41 GMT

Srivari Pushkarini: తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 01 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరు 15 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 01 నుండి 10 వ తేది వరకు పుష్కరిణి మూసివేయబడుతుంది.

కావున ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Tags:    

Similar News