Srivari Salakatla Brahmotsavams: సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి

శ్రీ మలయప్ప స్వామి

Update: 2025-09-30 13:03 GMT

Srivari Salakatla Brahmotsavams: తిరుమలలో సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో మలయప్ప భక్తులను అనుగ్రహించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వా మివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహ లంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు సకలరోగ ని వారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణు డే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సి ద్ధిస్తాయి.' అని అర్చకులు తెలిపారు. ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్ర ప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అనుగ్రహించనున్నారు.

Tags:    

Similar News