SSD Tokens Cancelled: జనవరి 24 నుండి 26 వరకు SSD టోకెన్లు రద్దు

SSD టోకెన్లు రద్దు

Update: 2026-01-09 06:46 GMT

SSD Tokens Cancelled: జ‌న‌వ‌రి 25న‌ తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణలతో కలిసి రథ సప్తమి రోజున భద్రత, భ‌క్తుల ర‌ద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశారని, అధికారులందరూ అదే స్ఫూర్తితో రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భ‌క్తుల‌ రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహ‌నాల‌ను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ, సోషియల్ మీడియాలో ప్రచారం ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.

Tags:    

Similar News