Suffering from Kala Sarpa Dosha: కాల సర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 ఆలయాలను సందర్శిస్తే విముక్తి ఖాయం
ఈ 5 ఆలయాలను సందర్శిస్తే విముక్తి ఖాయం
Suffering from Kala Sarpa Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువుల మధ్య అన్ని గ్రహాలు వచ్చినప్పుడు కాల సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఈ దోష తీవ్రతను తగ్గించి, జీవితంలో సానుకూలతను నింపే ఐదు అద్భుతమైన దేవాలయాల వివరాలు ఇవే..
కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (కర్ణాటక)
దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ ఆలయం సర్ప దోష నివారణకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కార్తికేయుడిని నాగ రూపంలో పూజిస్తారు. ఇక్కడ నిర్వహించే సర్ప సంస్కార పూజ అత్యంత శక్తివంతమైనది. నాగదేవత ఆశీస్సుల కోసం దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం
తిరుపతికి సమీపంలోని శ్రీ కాళహస్తిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇది పంచభూత లింగాలలో (వాయు లింగం) ఒకటి. విశేషం: రాహు-కేతువుల ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఇక్కడ రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ చేయించుకుంటారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
త్రయంబకేశ్వర ఆలయం
నాసిక్‌లో ఉన్న ఈ జ్యోతిర్లింగ క్షేత్రం గోదావరి నది జన్మస్థలం. ఇక్కడ వేద పండితుల సమక్షంలో నిర్వహించే నారాయణ బలి, కాల సర్ప దోష పూజలు చాలా ప్రత్యేకం. జాతక రీత్యా తీవ్రమైన దోషాలు ఉన్నవారికి ఇది సరైన పరిష్కార మార్గం.
మహా కాళేశ్వర ఆలయం
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి. ఇది అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగ క్షేత్రం. సర్ప దోషాల వల్ల కలిగే మానసిక అశాంతి, భయాలను పోగొట్టడానికి ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. పండుగ రోజుల్లో ఇక్కడ చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి.
ఓంకారేశ్వర్ ఆలయం
నర్మదా నది తీరాన వెలసిన ఈ జ్యోతిర్లింగం ఓంకార ఆకారంలో ఉంటుంది. పాముల వల్ల కలిగే దోషాలను, పితృ దోషాలను నివారించడానికి భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శివారాధన ద్వారా నాగ దోషాల తీవ్రత తగ్గుతుందని భక్తుల విశ్వాసం.
పరిష్కార మార్గాలు:
కేవలం దేవాలయ సందర్శనే కాకుండా, జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు నవగ్రహ పూజలు, నాగ దేవతకు అభిషేకాలు చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.