Telangana Tirupati: తెలంగాణ తిరుపతి..ఇవాళఉద్దాల ఉత్సవానికి సిద్ధమైన కురుమూర్తి
ఇవాళఉద్దాల ఉత్సవానికి సిద్ధమైన కురుమూర్తి
Telangana Tirupati: మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి వస్తుంది)లోని శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర స్వామి దేవస్థానం, చిన్నచింతకుంట మండలం, అమ్మాపూర్ (మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్ జిల్లా). ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 22, నుండి ప్రారంభమయ్యాయి. ఈ జాతరను తెలంగాణ తిరుపతి లేదా పేదల తిరుపతి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఉత్సవాలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతాయి.
ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 28) అత్యంత ముఖ్యమైన ఘట్టం అయిన ఉద్దాల ఉత్సవం (పాదుకల ఊరేగింపు) జరగనుంది. స్వామివారి పాదుకలు. వీటిని వడ్డేమాన్ గ్రామంలో ప్రత్యేక నిష్ఠతో తయారు చేసి, ఊరేగింపుగా కురుమూర్తి కొండపైకి తీసుకువస్తారు. ఈ ఉద్దాల ఊరేగింపును చూసేందుకు, స్వామి పాదుకలతో వీపుపై కొట్టించుకుంటే పాపాలు పోతాయని నమ్మి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.