Sacred Rituals to Be Performed in the Month of Magha: మాఘ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాలు ఇవే
పుణ్య కార్యాలు ఇవే
Sacred Rituals to Be Performed in the Month of Magha: మాఘమాసం ఆధ్యాత్మిక, ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టమైనది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండటం వల్ల దీనికి మాఘం అనే పేరు వచ్చింది. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, సూర్యుడిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు ఇదెంతో అనువైన సమయం. ఈ మాసమంతా విష్ణుసహస్రనామ పారాయణ, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు.
మాఘమాసం పుణ్యకార్యాలకు, దానధర్మాలకు పెట్టింది పేరు. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాల వాక్కు. రోజూ మాఘపురాణ పఠనం, విష్ణుసహస్రనామాలు స్మరించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
మాఘ మాసంలో పర్వదినాలు
చంద్ర దర్శనం(జనవరి 20), లలితా వ్రతం(21), వసంత పంచమి(23), రథసప్తమి(25), భీష్మాష్టమి(26), మధ్వనవమి(27), అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం(28), భీష్మ ఏకాదశి(29), వరాహ ద్వాదశి వ్రతం, పక్ష ప్రదోషం(30), విశ్వకర్మ జయంతి(31), మాఘ పౌర్ణమి, సతీదేవి జయంతి(ఫిబ్రవరి 1), సౌభాగ్య వ్రతం(2), సంకష్టహర చవితి(5), మంగళవ్రతం(9), విజయ ఏకాదశి(13), తిల ద్వాదశి, పక్ష ప్రదోషం(14), మహాశివరాత్రి(15), ధర్మ అమావాస్య(17).