Trending News

Avoid Wearing Silver Jewelry: ఆ మూడు రాశుల వారు వెండి ఆభరణాలు ధరించకూడదు.. ఎందుకో తెలుసా?

ఎందుకో తెలుసా?

Update: 2025-10-16 08:23 GMT

Avoid Wearing Silver Jewelry: బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతున్నప్పటికీ.. కొంద‌రు వెండి ఆభ‌ర‌ణాల‌ను చాలా ఇష్ట‌ప‌డ‌తారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మూడు రాశుల వారు వెండి వస్తువులను ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే వారు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వెండి ఎందుకు ధరించకూడదు?

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మేషం, ధనుస్సు, సింహ రాశులు అగ్ని తత్వానికి చెందినవి. వెండిని పాలించే గ్రహం చంద్రుడు నీటి తత్వానికి సంబంధించినవాడు. అగ్ని, నీరు ఒకదానికొకటి వ్యతిరేక అంశాలు కాబట్టి వాటిని కలపడం వల్ల హాని కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

వెండి ధరించకూడని ఆ మూడు రాశులు ఇవే:

మేష రాశి: మేష రాశికి పాలక గ్రహం కుజుడు. ఈ రాశి వారు వెండి ఉంగరం లేదా ఆభరణాలు ధరిస్తే ఆర్థిక నష్టం జరగవచ్చు. వెండిని ఉపయోగించడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది.

సింహ రాశి: సింహ రాశికి అధిపతి సూర్యుడు (వేడి గ్రహం). చంద్రుడు చల్లని గ్రహం. ఈ వ్యతిరేకత హానికరమని భావిస్తారు. సింహ రాశి వారు వెండి వస్తువులు ధరిస్తే, వారు ప్రారంభించే పనులకు ఆటంకాలు కలుగుతాయి. వీరు ఆర్థిక నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశికి పాలక గ్రహం బృహస్పతి. బృహస్పతికి సంబంధించిన లోహం బంగారం. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి వెండి అనుకూలమైన లోహం కాదు. ధనుస్సు రాశి వారు వెండి ఉంగరం లేదా ఇతర ఆభరణాలు ధరిస్తే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

కాబట్టి ఈ మూడు రాశుల వారు వెండి ఆభరణాలు ధరించే ముందు లేదా ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News