Trending News

Today Is Bhishmashtami: నేడు భీష్మాష్టమి.. ఇలా చేస్తే సంతాన ప్రాప్తి!

ఇలా చేస్తే సంతాన ప్రాప్తి!

Update: 2026-01-26 05:13 GMT

Today Is Bhishmashtami: మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.

పురుషులు మాత్రమే భీష్మ తర్పణం ఇవ్వాలి. ఉదయాన్నే తలస్నానం చేసి, నిత్యపూజలు చేయాలి. 12 PMకి పూజా మందిరంలో లేదా ఇంటి ఆవరణలో దక్షిణ ముఖంగా కూర్చోవాలి. ఆచమనంతో పాటు ప్రాణాయామం చేయాలి. అనంతరం ‘పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్యం కరిష్యే’ అని సంకల్పం చెప్పుకుని భీష్మునికి జలాన్ని వదలాలి. తద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.

భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి లేదా తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్మృతి కౌస్తుభం చెబుతోంది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, లోకమంతా ఆయనకు సంతానమేనని శాస్త్ర వచనం. అందుకే తండ్రి బతికున్న వారు కూడా ఈ రోజున ఆయనకు తర్పణం ఇవ్వవచ్చు. ‘వైయాఘ్య్రపద గోత్రాయ’ అనే శ్లోకం పఠిస్తూ నీటిని వదలడం వల్ల సంవత్సర కాలం పాటు చేసిన పాపాలు నశిస్తాయని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

Tags:    

Similar News