The President of India’s Tirumala Visit: భారత రాష్ట్రపతి తిరుమల పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

టీటీడీ అదనపు ఈవో సమీక్ష

Update: 2025-11-07 05:11 GMT

The President of India’s Tirumala Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబరు 21వ తేదీన తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా, పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు.

Tags:    

Similar News