Vaikuntha Dwara Darshan: ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

Update: 2025-12-13 05:56 GMT

Vaikuntha Dwara Darshan: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు.

Tags:    

Similar News