Vaikuntha Dwara Darshanams: వైకుంఠ ద్వార దర్శనాలు..తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Update: 2025-12-30 06:33 GMT

Vaikuntha Dwara Darshanams: వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో (ఉత్తర ద్వార దర్శనాలు) ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి.నేటి నుంచి జనవరి 19 వరకు వరుసగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, పలువురు ప్రముఖులు తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకున్నారు.

రామాలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గోదావరి తీరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు మిన్నంటాయి. లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతున్నాయి.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంతో పాటు నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి.మంగళగిరి, నెల్లూరు, ద్వారకా తిరుమల క్షేత్రాల్లో కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

తిరుమలలో కేవలం ముందస్తుగా టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి కావడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉంది.వృద్ధులు, చిన్న పిల్లలతో వెళ్లేవారు జాగ్రత్తలు వహించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News