Venus Retrograde Begins October 3: శుక్రుడి తిరోగమనం: అక్టోబర్ 3 నుంచి ఈ 3 రాశుల వారికి రాజయోగం.. నవంబర్ వరకు డబ్బే డబ్బు..
నవంబర్ వరకు డబ్బే డబ్బు..
Venus Retrograde Begins October 3: జ్యోతిష్య శాస్త్రంలో సంపద, వైభవం, ప్రేమ, విలాసాలకు కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వృషభం, తులా రాశులకు అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం తన స్వక్షేత్రమైన తులారాశిలో కొనసాగుతున్నాడు. అయితే అక్టోబర్ 3వ తేదీ నుంచి శుక్రుడు తిరోగమనం చెందనున్నాడు. సుమారు 42 రోజుల పాటు కొనసాగే ఈ తిరోగమన సంచారం నవంబర్ 14న ముగిసి తిరిగి మార్గంలోకి వస్తుంది. శుక్రుడి వక్రగతి ప్రభావం ద్వాదశ రాశులపై పడినప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు 'సువర్ణ కాలం' నడవనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులు, వారికి కలిగే ప్రయోజనాలు ఇవే..
కర్కాటక రాశి
కర్కాటక రాశికి నాలుగవ ఇంట్లో శుక్రుడి సంచారం సాగనుంది. దీనివల్ల ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయంలో అనూహ్య వృద్ధి కనిపిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని ధనలాభం అందుతుంది. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మిథున రాశి
మిథున రాశికి ఐదవ స్థానంలో శుక్రుడి సంచారం జరగనుంది. దీనివల్ల ఈ రాశివారి ప్రతిభ వెలుగులోకి వచ్చి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి కొత్త బాధ్యతలు దక్కుతాయి. వ్యాపార విస్తరణకు, లాభాలార్జనకు ఇది అనువైన సమయం.పాత పెట్టుబడుల ద్వారా ఆశించిన ప్రతిఫలాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. పాత అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సరైన ప్రణాళికలతో ముందడుగు వేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశికి పదవ స్థానంలో శుక్ర సంచారం ఉంటుంది. ఉద్యోగ, వృత్తి జీవితంలో అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తాయి.ఉద్యోగంలో పదోన్నతులు, కీలక బాధ్యతలు లేదా ఇంక్రిమెంట్లు లభించే సూచనలు ఉన్నాయి. మీడియా, ఫ్యాషన్, సినిమా, కళా రంగాల్లో పనిచేసే వారికి అద్భుతమైన అవకాశాలు కలిసివస్తాయి. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపారస్తులకు భారీ లాభాలు చేకూరతాయి. కొత్త ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అయితే, చేతికి డబ్బు అందుతున్న కొద్దీ అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం.