VIP Break Darshan Cancelled: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Update: 2025-12-05 05:50 GMT

VIP Break Darshan Cancelled: 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగింది. టీటీడీ ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 51,082 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,836 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది.

Tags:    

Similar News