TIRUMALA TIRUPATI : జూలై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఆ రెండు రోజులూ సిఫార్సు లేఖలు అనుతించమన్న టీటీడీ;
జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు రద్దు చేసింది. జూలై 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్ధానం ఘనంగా జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు రోజు అనగా జూలై 15వ తేదీన తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు తిరుమలలో ఘనంగా జరగనున్న వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖలకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని టీడీపీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.