Strengthen Jupiter (Guru) Planet in Your Horoscope: జాతకంలో గురు గ్రహ బలం పెరగాలా?
గురు గ్రహ బలం పెరగాలా?
Strengthen Jupiter (Guru) Planet in Your Horoscope: నవగ్రహాలలో శుభ గ్రహంగా భావించే గురువు (బృహస్పతి) అనుగ్రహం ఉంటేనే జీవితంలో అభివృద్ధి, సుఖసంతోషాలు లభిస్తాయి. జాతకంలో గురు బలం క్షీణించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, వివాహంలో జాప్యం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరిహారాల ద్వారా గురు గ్రహ బలాన్ని పెంచుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ పుట్టింటి నుంచి తెచ్చిన దీపపు కుందులతో నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఆ కుటుంబానికి గురు కటాక్షం లభిస్తుంది. అలాగే, జీవకారుణ్యం చాటుతూ చీమలు ఎక్కువగా ఉన్న చోట చక్కెరను ఆహారంగా చల్లడం వల్ల దోషాలు తొలగి శుభం కలుగుతుంది. మరికొన్ని విశేష పరిహారాల్లో భాగంగా సాధువులకు లేదా పేదలకు నెయ్యి దానం చేయడం వల్ల గురు గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది. అలాగే ఇంటికి పడమర దిశలో ఉన్న శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యం దానం ఇవ్వడం శ్రేయస్కరం. ప్రతిరోజూ ఇంటి ఈశాన్య మూలలో 9 వత్తులతో కూడిన నేతి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి పోయి, దైవానుగ్రహం లభిస్తుంది. నిత్యం గురుస్తోత్రం పఠించడం, కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల గురు గ్రహ బలం చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు.