Diwali Day: దీపావళి రోజన ఎలాంటి పనులు చేస్తే మంచిది?
ఎలాంటి పనులు చేస్తే మంచిది?
Diwali Day: లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి, ప్రతి మూల దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ సమయంలో విగ్రహం (లేదా) ఫొటోను ఎర్రటి వస్త్రంపై ఉంచాలి. పూజను తూర్పు (లేదా) ఈశాన్య మూలలో చేయాలి. ఇంటి గుమ్మం వద్ద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ వేసి, గడపకు పూజ చేయాలి. ఇది పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. పూజలో భాగంగా అఖండ దీపం వెలిగిస్తే.. అది మరుసటి రోజు ఉదయం వరకు ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి.
దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.
దీపావళి లక్ష్మీ పూజలో పసుపు, ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. పసుపు(బృహస్పతి) సంపద, శాంతిని, ఎరుపు(కుజుడు) శక్తి, ధైర్యాన్ని, తెలుపు శాంతి, లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తాయని అంటున్నారు. నీలం, నలుపు రంగులు అశుభమని, ఆ రంగు దుస్తులు ధరించకూడదని అంటున్నారు. నైలాన్, పాలిస్టర్‌లకు దూరంగా, కాటన్, పట్టు వంటి సురక్షితమైన వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం’ అంటున్నారు.