First Ekadashi: తొలి ఏకాదశి ఎప్పుడు..ఏం చేయాలి .?
ఏం చేయాలి .?;
First Ekadashi: తెలుగు వారికి తొలి ఏకదాశి అంటే ఎంతో స్పెషల్ ..వర్షాకాలం ప్రారంభంలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి జులై 6న తొలి ఏకాదశి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై 05న సాయంత్రం 06:58 గంటలకు ప్రారంభమై... జూలై 06న రాత్రి 09:14 గంటలకు ముగుస్తుంది. ఈ ఏకాదశి రోజు ( జులై 6) విష్ణుమూర్తి శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు . కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయనం దిశలో మనకు కనిపిస్తారు.తొలి ఏకాదశి ని రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారు.తొలి ఏకాదశి రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునే వారు ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకునే విష్ణుమూర్తి దేవుడి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.