West-Facing Sun Temple: ప్రపంచంలోనే పడమర దిక్కున్న ఏకైక సూర్యదేవాలయం ఎక్కడంటే.?
ఏకైక సూర్యదేవాలయం ఎక్కడంటే.?;
West-Facing Sun Temple: సూర్యదేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణంగా సూర్యదేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. అయితే ప్రపంచంలోనే పడమర దిక్కుగా ఉన్న ఏకైక సూర్యదేవాలయం నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లిలో ఉండటం విశేషం. ఈ ఆలయం, సూర్యదేవుని పడమర దిక్కుకు అభిముఖంగా ఉండటం ఒక ప్రత్యేకత.
దేశంలోని అన్ని సూర్యదేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఇది మాత్రం పడమర ముఖంగా ఉంది. అంతే కాకుండా. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో సూర్య భగవానుడి పాదాల చెంత సూర్యకిరణాలు పడతాయి. ప్రతిరోజూ సాయంత్రం స్వామివారికి నిత్య పూజలు చేస్తారు. ఇక్కడ శని దేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుగుతుంటాయి. తొలి ఏకాదశి రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కృష్ణా నదిలో స్నానమాచరించి పూజలు చేస్తుంటారు. ప్రతి ఏటా చెన్నకేశవ స్వామి కల్యాణం వైభవంగా జరుగుతుంది.
హైదరబాద్ నుంచి వెళ్లే వాళ్లు నల్గొండ వెళ్లాలి. అక్కడి నుంచి నార్కెట్పల్లి-అద్దంకి(45వ జాతీయ రహదారి) గుండా మిర్యాలగూడ వెళ్లాలి. అక్కడి నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే దామరచర్ల వస్తుంది. అక్కడి నుంచి నుంచి వీర్లపాలెం పాతిక కిలోమీటర్లు ప్రయాణిస్తే అడవిదేవులపల్లికి చేరుకోవచ్చు.. ఎందుకు లేట్..ఈ ఏకాదశి రోజు ఒకసారీ వెళ్లి రండి..