Performing Abhishekam to the Shiva Linga: శివలింగానికి అభిషేకం చేసేటపుడు ఏ దిక్కున ఉండాలి

ఏ దిక్కున ఉండాలి

Update: 2025-12-08 08:28 GMT

Performing Abhishekam to the Shiva Linga: ఇది పరమశివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పూజా విధానం. శివుడిని 'అభిషేక ప్రియుడు' అంటారు. శివలింగంపై భక్తితో కాసిని నీళ్లు పోసినా లేదా రుద్రాభిషేకం చేసినా స్వామివారు సుప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తారని నమ్ముతారు.శివాభిషేకం చేయడం వల్ల పాపాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, మానసిక ప్రశాంతత, అకాల మరణ భయం నివారణ వంటి ఫలితాలు లభిస్తాయి.శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు , నియమాలు తెలుసుకుందాం

ప్రాథమిక నియమాలు (శుద్ధి)

అభిషేకం చేసే వ్యక్తి తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు (పురుషులు పంచె, స్త్రీలు చీర) ధరించాలి. ప్రశాంతమైన మనసుతో, పరమేశ్వరుడిపై పూర్తి భక్తి భావంతో అభిషేకం చేయాలి. కోరికలు పక్కన పెట్టి, కేవలం భక్తితో చేయడం ఉత్తమం. అభిషేకం చేసేటప్పుడు సాధారణంగా తూర్పు ముఖంగా ఉండి చేయాలి. ఇది కుదరకపోతే, ఉత్తరం వైపున ఉండి చేయవచ్చు.

అభిషేక ద్రవ్యాలలో జాగ్రత్తలు

అభిషేకానికి ఉపయోగించే ద్రవ్యాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె) శుభ్రంగా, స్వచ్ఛంగా, పులుపు లేనివిగా ఉండాలి. పాలు కాచి చల్లార్చినవి, గేదె లేదా ఆవు పాలు వాడాలి.

శివలింగానికి తులసిని సమర్పించకూడదు. సాధారణంగా శివలింగానికి కుంకుమ (పసుపుతో చేసినది కాకుండా, నుదిటి బొట్టు కోసం వాడేది) పెట్టకూడదు. శివలింగానికి శంఖంతో నీరు పోసి అభిషేకం చేయకూడదు.

అభిషేకం చేసే పద్ధతి

మంత్ర పఠనం: అభిషేకం చేసేటప్పుడు, శివుడికి సంబంధించిన మంత్రాలు, ముఖ్యంగా ఓం నమశ్శివాయ లేదా రుద్ర నమకం/చమకం పఠించడం అత్యంత శ్రేయస్కరం. మంత్రాలు తెలియకపోయినా, భక్తితో 'శివాయ నమః' అని చెప్పినా సరిపోతుంది. సాధారణంగా అభిషేకం చేసే క్రమం ఉంటుంది. ముందుగా జలంతో శుద్ధి చేసి, తర్వాత పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార/చెరకు రసం) ఒక్కొక్కటిగా పోసి, చివరగా మళ్లీ శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయిన తర్వాత, శివాలయంలో సగం వరకే ప్రదక్షిణ చేయాలి (సోమసూత్రం దాటకూడదు).

విరామం

లింగాన్ని తాకవద్దు: అభిషేకం పూర్తైన వెంటనే, లింగాన్ని అలానే వదిలివేయకుండా, దానిని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, గంధం, విభూది (భస్మం), బిల్వ పత్రాలు సమర్పించి అలంకరించాలి. శివలింగంపై ఎప్పుడూ ఏమీ లేకుండా ఖాళీగా ఉంచకూడదు.

Tags:    

Similar News