Shouldn’t Salt Be Donated in the Evening: మనం పెద్దల నుంచి తరచూ వినే మాట.. "పదేపదే ఎవరినీ ఉప్పు అడగకూడదు" అని.. అలాగే "సూర్యాస్తమయం అయ్యాక ఉప్పును బయట వారికి ఇవ్వకూడదు" అని. అసలు ఈ నమ్మకాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాలు ఏంటో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉప్పుకు శుక్రుడు, చంద్రుడు అనే రెండు గ్రహాలతో సంబంధం ఉంది. శుక్రుడు సంపదకు, సుఖసంతోషాలకు కారకుడైతే.. చంద్రుడు మన మనశ్శాంతిని ప్రభావితం చేస్తాడు. అందుకే ఉప్పు విషయంలో చేసే పొరపాట్లు మన జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు.

చాలామంది పక్కింటి వాళ్ళని అప్పుడప్పుడు ఉప్పు అడుగుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఇలా పదేపదే చేయడం వల్ల జాతకంలో శుక్ర గ్రహం బలహీనపడుతుంది. దీనివల్ల అనవసర ఖర్చులు పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పూర్వకాలంలో ఉప్పును ఉచితంగా తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు.

ఉప్పుకు చంద్రుడితో సంబంధం ఉండటం వల్ల, అనవసరంగా ఉప్పు అడిగే అలవాటు ఉన్నవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, కుటుంబంలో కలహాలు రావడం వంటివి సంభవించవచ్చు.

వాస్తు ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు. సాయంత్రం పూట ఉప్పు ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి లేదా పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుముడుతుందని పెద్దలు హెచ్చరిస్తుంటారు.

అయితే, ఉప్పు నెగటివ్ ఎనర్జీని పోగొట్టడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా కూడా పనిచేస్తుంది. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు కలిపి తుడిస్తే, ఇంట్లోని చెడు పోయి ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఒక గాజు గిన్నెలో ఉప్పు నింపి ఇంటి మూలలో ఉంచితే ప్రతికూల శక్తులు నశిస్తాయి.

Tags: