People Who Stay Up Late at Night Really Lazy: రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారు సోమరులేనా?
సోమరులేనా?
People Who Stay Up Late at Night Really Lazy: ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఉత్సాహంగా పనులు చేసేవారు కొందరైతే, రాత్రి 12 గంటలు దాటిన తర్వాతే చురుగ్గా పనిచేసేవారు మరికొందరు. ఒకే వాతావరణంలో పెరిగిన వ్యక్తుల్లోనూ నిద్రపోయే సమయం, మెలకువ వచ్చే సమయం ఎందుకు భిన్నంగా ఉంటాయి? దీనికి శరీరంలోని బయోలాజికల్ క్లాక్ ఒక ముఖ్యమైన కారణం.
మన శరీరంలో దాదాపు 24 గంటల వ్యవధిలో పనిచేసే సహజ కాలచక్రాన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది నిద్ర, మెలకువ, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల విడుదల వంటి అనేక ప్రక్రియలను నియంత్రిస్తుంది. మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో ఉండే సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ (SCN) ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. వెలుతురు, చీకటి వంటి పరిసర సంకేతాల ఆధారంగా శరీర గడియారాన్ని సమన్వయం చేస్తుంది.
వ్యక్తులను సాధారణంగా మార్నింగ్ టైప్, ఈవెనింగ్ టైప్ వంటి వర్గాలుగా పరిశీలిస్తారు. కొందరు ఉదయాన్నే చురుగ్గా ఉంటే, మరికొందరు సాయంత్రం లేదా రాత్రివేళల్లో ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. దీనిపై వయస్సు, జన్యుపరమైన అంశాలు, జీవనశైలి కూడా ప్రభావం చూపుతాయి.
రాత్రి పని చేయడం, పగలు నిద్రపోవడం, తరచూ నిద్ర సమయాలను మార్చుకోవడం వంటి అలవాట్లు శరీర గడియారంతో సంఘర్షణకు దారితీయవచ్చు.