Eating These Snacks After 6 PM: సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ స్నాక్స్ తింటున్నారా..?

ఈ స్నాక్స్ తింటున్నారా..?

Update: 2025-12-31 07:19 GMT

Eating These Snacks After 6 PM: చలికాలం లేదా వర్షాకాలం సాయంత్రాల్లో చల్లటి గాలి వీస్తున్నప్పుడు వేడివేడిగా సమోసాలు, పకోడీలు తినాలని ఎవరికి ఉండదు..? కానీ ఈ అలవాటు మీ జీవక్రియను నెమ్మదింపజేసి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు దూరంగా ఉండాలి?

రాత్రి సమయం దగ్గరపడుతున్న కొద్దీ మన శరీరంలో జీర్ణప్రక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో భారీ ఆహారాలు తీసుకుంటే కలిగే నష్టాలు ఇవే..

డయాబెటిస్ ముప్పు: వేయించిన ఆహారాలు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచి, టైప్-2 డయాబెటిస్‌కు కారణమవుతాయి.

జీర్ణ సమస్యలు: రాత్రిపూట నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కొవ్వు నిల్వలు: వీటిలోని అధిక కేలరీలు ఖర్చు అవ్వవు, ఫలితంగా శరీరంలో కొవ్వు వేగంగా పేరుకుపోతుంది.

పేగు ఆరోగ్యం: వేయించిన పదార్థాలు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నశింపజేసి, వాపును లిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

6 గంటల తర్వాత నో చెప్పాల్సినవి

నూనె పదార్థాలు: సమోసాలు, పకోడీలు, బజ్జీలు.

జంక్ ఫుడ్: వెన్న, చీజ్ అధికంగా ఉండే బర్గర్లు, పిజ్జాలు.

స్వీట్లు: జిలేబీ వంటి చక్కెర శాతం ఎక్కువగా ఉండే డెజర్ట్‌లు.

కారంగా ఉండే వీధి ఆహారాలు: మసాలా పూరి, చాట్ వంటివి.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు

సాయంత్రం ఆకలిని తీర్చుకోవడానికి ఈ క్రింది పోషక విలువలున్న ఆహారాలను ఎంచుకోండి:

మఖానా: వెన్న లేకుండా దోరగా వేయించిన మఖానా శరీరానికి చాలా మంచిది.

స్వీట్ కార్న్: ఉడికించిన తీపి మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

వెజిటబుల్ సూప్: వేడివేడి కూరగాయల సూప్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ప్రోటీన్ స్నాక్స్: తక్కువ నూనెతో చేసిన పనీర్ ఫ్రై లేదా గుగ్గిళ్లు.

ఆవిరి కుడుములు: గోధుమ పిండితో చేసి ఆవిరిపై ఉడికించిన చిరుతిళ్లు సులభంగా జీర్ణమవుతాయి.

సాయంత్రం వేళ మీ నాలుకను కాక, మీ జీర్ణాశయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారం తీసుకోండి. 6 గంటల తర్వాత తీసుకునే తేలికపాటి ఆహారమే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags:    

Similar News