Boiling vs Steaming: కూరగాయలను నీటిలో ఉడబెట్టడం మంచిదా..? ఆవిరికి ఉడబెట్టడం మంచిదా..?
ఆవిరికి ఉడబెట్టడం మంచిదా..?;
Boiling vs Steaming: కూరగాయలు ఉడకబెట్టినప్పుడు, నీటిలోకి లీచ్ అవ్వడం వల్ల అనేక పోషకాలు పోతాయి. అయితే ఆవిరితో ఉడికిస్తే పోషకాల నష్టం తక్కువగా ఉంటుంది. అందువల్ల, పోషకాలను నిలుపుకోవడంలో నీటి ఆవిరి మీద ఉడికించడం అత్యుత్తమమైనది. ఎక్కువగా ఉడికించడం వల్ల కూరగాయల రుచి తగ్గుతుంది. ఉడికించిన కూరగాయల కంటే ఆవిరి మీద ఉడించిన కూరగాయలు మంచి రుచి, వాసన కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కూరగాయలలోని ఆక్సలేట్లు వంటి హానికరమైన పదార్థాలు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయి.
మరిగేటప్పుడు 87శాతం వరకు ఆక్సలేట్లు తొలగించబడతాయి. అదే ఆవిరి మీద ఉడికిస్తే 53శాతం మాత్రమే పోతాయి. కాబట్టి నీటిలో ఉడించడం బెటర్.
సూప్ లేదా రసం తయారుచేసేటప్పుడు నీటిలో ఉడబెట్టడం మంచిది. ఎందుకంటే కూరగాయల నుండి కోల్పోయిన పోషకాలు నీటిలో కలిసిపోతాయి. కాబట్టి మీరు అదే నీటితో సూప్ తయారు చేసినప్పుడు మీకు పూర్తి పోషకాలు లభిస్తాయి.
రెండు పద్ధతులకు వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తయారు చేస్తున్న ఆహారం, మీ వంట లక్ష్యాలను బట్టి, మీరు నీటిలో ఉడకబెట్టడం లేదా నీటి ఆవిరితో ఉడబెట్టాలా అనేది ఎంచుకోవాలి. రెండూ ఆరోగ్యకరమైన, ప్రభావవంతమైన వంట పద్ధతులు.