Your Health Is Your Wealth: కొత్త ఏడాదిలో మీ ఆరోగ్యమే మీ సంపద.. ఈ 5 తీర్మానాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి..
ఈ 5 తీర్మానాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి..
Your Health Is Your Wealth: మరో కొత్త ఏడాది వచ్చేస్తోంది.. ప్రతి ఏటా ఏదో ఒక తీర్మానం చేసుకోవడం మనకు అలవాటే. అయితే ఈసారి కేవలం అలవాట్లు మార్చుకోవడం మాత్రమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యం కోసం కొన్ని ప్రతిజ్ఞలు చేద్దాం. ఒత్తిడి లేని రోగాల దరిచేరని హ్యాపీ లైఫ్ కోసం ఈ క్రింది మార్పులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి.
రోజూ 30 నిమిషాల వ్యాయామం
వ్యాయామం అంటే కేవలం జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడం మాత్రమే కాదు. ప్రతిరోజూ మీ శరీరం కోసం ఒక అరగంట కేటాయించండి. నడక, యోగా, సైక్లింగ్ లేదా మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏదైనా సరే.. శారీరక శ్రమ తప్పనిసరి. ఇది మీ శరీర బరువును నియంత్రించడమే కాకుండా రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
జంక్ ఫుడ్‌కు నో.. పోషకాహారానికి యెస్
రుచి కోసం తినే జంక్ ఫుడ్ మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
బయటి ఆహారాన్ని తగ్గించి, ఇంట్లో వండిన సమతుల్య ఆహారం తీసుకోండి.
మీ ప్లేట్‌లో పండ్లు, ఆకుకూరలు మరియు ప్రోటీన్ అధికంగా ఉండేలా చూసుకోండి. అలాగే పుష్కలంగా నీరు త్రాగడం మర్చిపోవద్దు.
నిద్రకు పట్టం కట్టండి!
స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అని ఈ కాలంలో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.
రాత్రిపూట 7 నుండి 8 గంటల గాఢ నిద్ర శారీరక పునరుజ్జీవనానికి చాలా అవసరం.
ప1డుకోవడానికి గంట ముందు మొబైల్‌ను పక్కన పెట్టేయండి. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
మానసిక ప్రశాంతతే అసలైన ఆరోగ్యం
శరీరం ఎంత ఫిట్‌గా ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకపోతే లాభం లేదు.
ఒత్తిడిని దూరం చేయడానికి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి.
మీకు ఇష్టమైన పుస్తకం చదవడం లేదా ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడటం వంటివి అలవాటు చేసుకోండి.
వ్యసనాలకు దూరం.. ప్రకృతికి దగ్గర
ధూమపానం, మద్యం వంటి అలవాట్లను ఈ ఏడాదితో వదిలేయండి. మీ మొబైల్ స్క్రీన్‌పై గడిపే సమయాన్ని తగ్గించి, ప్రకృతి ఒడిలో లేదా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద సానుకూలతను తెస్తుంది. ఈ నూతన సంవత్సర తీర్మానాలు కేవలం జనవరి నెలకు మాత్రమే పరిమితం కాకుండా ఏడాది పొడవునా కొనసాగించినప్పుడే 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే మాట నిజమవుతుంది.