Palm Sprouts (Gegulu): ఆరోగ్యానిచ్చే గేగుల విక్రయం జోరు – పోషకాలతో నిండిన సీజనల్ ఆహారం
సీజనల్ ఆహారం
Palm Sprouts (Gegulu): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఆరోగ్యానికి మేలు చేసే గేగులు జోరుగా విక్రయమవుతున్నాయి. సీజనల్ ఉపాధిగా అందరికి అందుబాటు ధరలో ఉండే ఈ గేగులను రైతులు తెచ్చి విక్రయిస్తున్నారు. చక్కని రుచితో ఎక్కువ పోషకాలు కలిగిన గేగులను ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు.
తాటిచెట్లకు ముంజల గెలలు ఉంటాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజలను తింటారు. కాయలు ముదిరాక పండ్లుగా మారి రాలుతాయి. కొందరు రైతులు ఏరి తమ పొలాల ఒడ్డున నీరుపారే ప్రాంతంలో పాతి పెడతారు. అవి మొలకెత్తి పెరుగుతున్న క్రమంలో వాటిని తవ్వితీసి ఆకులు కత్తిరించి కాండాన్ని కుండలో ఉడకబెట్టడం, దోరగా అయ్యేలాగా కాలుస్తారు. వాటి పైపొరను తొలగించడంతో చక్కగా తినడానికి వీలుగా గేగులు తయారవుతాయి.
గేగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు తక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చర్మ వ్యాధులు రాకుండా కాలేయం పెరగకుండా, మలబద్ధక నివారణకు తోడ్పడుతుంది. రుచిగా ఉండే వంద గ్రాముల గేగులో 1.04 ప్రోటీన్లు, 0.19 శాతం ఫ్యాట్, 76.86 శాతం సుక్రోజ్, 1.66 శాతం గ్లూకోజ్, 3.15 శాతం మినరల్స్, 0.86 శాతం కాల్షియం, 0.05 శాతం పాస్పరస్, 11.01 ఎంజీ ఐరన్, 0.7 ఎంజీ కాపర్‌తో పాటు విటమిన్ బీ కూడా ఉంటుంది.
నాలుగు, ఐదు గేగుల కట్టకు రూ.15-20 వరకు విక్రయిస్తున్నారు. ఈ గేగులు సీజనల్ ఆహారంగా ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. రైతులకు అదనపు ఆదాయం కలిగిస్తున్నాయి. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మినరల్స్, విటమిన్లు శరీరానికి బలం ఇస్తాయి. సిరిసిల్ల ప్రాంతంలో ఈ గేగులు సాంప్రదాయంగా తయారు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆహారాన్ని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.