Drinking Beer: బీర్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.?

ఇన్ని ప్రయోజనాలా.?;

Update: 2025-07-05 17:37 GMT

Drinking Beer:  బీర్లు తాగడం వల్ల లాభాలున్నాయంటున్నాయి కొన్ని అధ్యయనాలు. బీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలిందంట. బీర్ తాగితే పొట్ట పెరుగుతుందని చాలామంది అనుకుంటరు. అందుకే.. చాలాసార్లు బీర్ తాగాలని ఉన్నా.. పొట్ట వస్తుందేమో అని భయపడతారు. ఈ స్టడీలో బీర్ తాగితే పొట్ట వస్తుందనేది అవాస్తవం అని తేలింది. వీళ్లే కాదు లండన్ యూనివర్సిటీ వాళ్లు చేసిన అధ్యయనంలో కూడా బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందనేది అబద్దం అని తేలింది. కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే ఇందులోని ఫ్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయట.

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి డాక్టర్లు వీలైనంత ఎక్కువ నీళ్లు తాగమని చెప్తారు. దొరికితే కలుషితం కాని స్వచ్ఛమైన కల్లు తాగమని చెప్తారు. కల్లు దొరికితే ఓకే. కానీ... పట్నంలో ఉండేవారికి కల్లెక్కడ దొరుకుతుంది?

అందుకే చాలామంది రాళ్లతో బాధపడే వారికి అప్పుడప్పుడు ఓ బీర్ వేయమని సలహా ఇస్తారు. ఎందుకంటే బీర్ లో రాళ్లు కరిగించే గుణాలున్నాయి. పొటాషియం, మెగ్నీషియం బీరులో పుష్కలంగా ఉండి, కిడ్నీలో రాళ్లు

కరిగించడానికి సహాయపడతాయి.

శరీరానికి ఎంత ఫైబర్ అందితే.. బాడీ అంత దృఢంగా అవుతుంది. జీవక్రియలు అంతే సక్రమంగా జరుగుతాయి. ఈ విషయం ఏ డాక్టరును అడిగినా చెప్తారు. అందుకే.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొమ్మని సలహా ఇస్తుంటారు. అయితే... బీర్ లో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ బీర్లో 20శాతం ఉంటుందంటే నమ్మాల్సిందే..

బీర్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి, కానీ ఇది మితంగా తీసుకోవలసిన అవసరం ఉంది.అధికంగా బీర్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఎవరి ఆరోగయ పరిస్థితులను బట్టి వాళ్లు డాక్టర్ల సలహా మేరకు బీర్లు తాగడం మంచిది.

Tags:    

Similar News