To Lose Weight: బరువు తగ్గాలనుకునేవారు వీటి జోలికిఅస్సలు పోవద్దు!

వీటి జోలికిఅస్సలు పోవద్దు!;

Update: 2025-08-16 16:18 GMT

To Lose Weight: ఆధునిక కాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య అధిక బరువు. బరువు తగ్గడానికి చాలామంది వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, బరువు తగ్గే క్రమంలో కొన్ని రకాల పానీయాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఏ పానీయాలు తీసుకోవద్దు?

పండ్ల రసాలు: బరువు తగ్గాలనుకునేవారు పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం మంచిది. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు, కానీ కేలరీలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. పండును నేరుగా తింటే ఫైబర్ లభించి, త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.

కార్బొనేటెడ్ పానీయాలు: కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు. వాటిలో చక్కెర, సోడా కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ఆరోగ్యానికి హానికరమైనవి. ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి.

మద్యం: ఆల్కహాల్‌లో పోషకాలు ఏమాత్రం ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కేలరీలు పెరగడంతో పాటు, ఆల్కహాల్‌తో పాటు తీసుకునే చిప్స్, ఇతర స్నాక్స్ మొత్తం కేలరీల సంఖ్యను మరింత పెంచుతాయి.

ఆరోగ్యకరమైన పానీయాలు ఏవి?

వ్యాయామం తర్వాత ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం మంచిదే. కానీ అధిక మోతాదులో కెఫీన్ ఉన్న పానీయాలు గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇటువంటి పానీయాలకు బదులుగా సహజమైన పండ్ల రసాలు (చక్కెర లేకుండా), మంచినీరు, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం ఉత్తమం. సరైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Tags:    

Similar News