Food for Children Below Five Years: ఐదేళ్ల లోపు పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలంటే.?

పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలంటే.?

Update: 2025-12-29 07:16 GMT

Food for Children Below Five Years: ఐదేళ్లలోపు పిల్లల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది, కాబట్టి వారికి పోషక విలువలు ఉన్న ఆహారం అందించడం చాలా ముఖ్యం. పిల్లలకు కొన్నిరకాల ఆహారపదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలకు తేనె పెడితే బొట్యులిజం అనే వ్యాధి వస్తుంది. దీంతో చిన్నారుల్లో చూపు మందగించడం, అలసట, నీరసం వస్తాయి. అలాగే పాశ్చరైజేషన్‌ చేయని పాలు, జ్యూసులు, పెరుగులో ఈ.కొలి బ్యాక్టీరియా పెరిగి విరేచనాలు, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు, ఉప్పు కూడా ఎక్కువగా ఇవ్వకూడదని సూచిస్తున్నారు.

ప్రోటీన్లు ఎదుగుదలకు, కండరాల బలం కోసం పప్పు ధాన్యాలు (Dals), గుడ్లు, పాలు, పెరుగు, పనీర్ , ఉడికించిన మాంసం ఇవ్వాలి. శక్తి కోసం బియ్యం, గోధుమలు (రోటీ), జొన్నలు, రాగులు , ఓట్స్ వంటివి పెట్టాలి. ముఖ్యంగా రాగి జావ పిల్లలకు ఎంతో బలాన్నిస్తుంది. రోగనిరోధక శక్తి కోసం తాజా పండ్లు (అరటిపండు, ఆపిల్, బొప్పాయి), ఆకుకూరలు తప్పనిసరి.

పిల్లలకు ఉదయం (Breakfast) ఇడ్లీ, దోశ, రాగి జావ లేదా పాలు-ఓట్స్. (గుడ్డు పెడితే ఇంకా మంచిది).మధ్యాహ్నం.మెత్తగా ఉడికించిన అన్నం, పప్పు, ఏదైనా కూరగాయల కూర. ఒక కప్పు పెరుగు. సాయంత్రం.తాజా పండ్లు, నానబెట్టిన బాదం/జీడిపప్పు లేదా ఉడికించిన శనగలు. రాత్రి (Dinner) తేలికగా అరిగే అన్నం లేదా మెత్తని చపాతీ, పప్పు/కూర ఉండేటట్లు చూడాలి. పిల్లల కడుపు చిన్నది కాబట్టి, ఒకేసారి ఎక్కువగా పెట్టకుండా రోజుకు 5-6 సార్లు తక్కువ మొత్తంలో పెట్టాలి. ప్లేటులో రకరకాల రంగుల కూరగాయలు, పండ్లు ఉంటే పిల్లలు ఆసక్తిగా తింటారు. ఆటలాడే పిల్లలకు డీహైడ్రేషన్ అవ్వకుండా తగినంత నీరు తాగించాలి.

4. వీటిని నివారించండి:

జంక్ ఫుడ్: చిప్స్, కుర్కురే, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, చాక్లెట్లు పరిమితం చేయాలి.

అధిక చక్కెర/ఉప్పు: చిన్న వయసులోనే వీటికి అలవాటు చేయడం మంచిది కాదు.

టీవీ లేదా మొబైల్ చూపిస్తూ అన్నం పెట్టడం మానేయాలి. దీనివల్ల వారు ఏమి తింటున్నారో వారికి తెలియదు.

Tags:    

Similar News