Tired of Body Odour: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమట దుర్వాసన. అండర్‌ఆర్మ్స్ నుండి వచ్చే ఈ బ్యాడ్ బాడీ ఓడర్ వల్ల పబ్లిక్‌లో ఒక్కోసారి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బయట దొరికే ఖరీదైన డియోడరెంట్స్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

- నిమ్మకాయ, బేకింగ్ సోడా

మొదటి చిట్కాగా నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చెమట వాసన ఎక్కువగా ఉంటే, కొద్దిగా నిమ్మరసంలో చిటికెడు బేకింగ్ సోడా కలిపి అండర్‌ఆర్మ్స్‌కి రాసి, పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చెమటను అరికట్టడంతో పాటు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

- ఆపిల్ సైడర్ వెనిగర్ , టీ ట్రీ ఆయిల్

ఆపిల్ సైడర్ వెనిగర్. దీన్ని కొద్దిగా నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి అండర్‌ఆర్మ్స్‌పై స్ప్రే చేసుకుంటే pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే, యాంటీ- బాక్టీరియా గుణాలు ఉండే టీ ట్రీ ఆయిల్‌ను కొబ్బరి నూనెలో కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇది బాడీ ఓడర్‌ను క్షణాల్లో దూరం చేస్తుంది.

- కలబంద , జీవన శైలి మార్పులు

వీటితో పాటు రోజువారీ చర్మ సంరక్షణలో తాజా కలబంద గుజ్జును వాడడం వల్ల చర్మం చల్లబడడమే కాకుండా దుర్వాసన తగ్గుతుంది. ఇవే కాకుండా, రోజూ కనీసం రెండు పూటలా స్నానం చేయడం, సింథటిక్ బట్టలకు బదులుగా కాటన్ దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. అలాగే, వేయించిన పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు తగ్గించి.. నీళ్లు ఎక్కువగా తాగి, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

Tags: