Want Thick, Long Hair: ఒత్తైన, పొడవైన జుట్టు కావాలా? ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

మీ డైట్‌లో ఉండాల్సిందే!

Update: 2026-08-05 07:15 GMT

Want Thick, Long Hair: పొడవుగా, ఒత్తుగా, మెరిసే జుట్టు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి? దాని కోసం వేల రూపాయలు ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, హెయిర్ ఆయిల్స్ మారుస్తూనే ఉంటాం. కానీ, అసలైన రహస్యం బాటిళ్లలో కాదు... మీ ప్లేట్‌లోని ఆహారంలోనే ఉందని మీకు తెలుసా? అవును! జుట్టు ఆరోగ్యానికి బాహ్య సంరక్షణ ఎంత అవసరమో, అంతకంటే వంద రెట్లు ఎక్కువ పోషణ లోపలి నుంచి అందాలి.

కీలకమైనవి

గుడ్లు,ప్రొటీన్ , బయోటిన్ లో లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది. గుడ్లలో ఈ రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది.

బెర్రీ జాతులు (Berries). స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ బారి నుంచి జుట్టును కాపాడుతుంది, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు విరిగిపోకుండా చేస్తుంది.

మన అందరికీ దొరికే ఆకుకూరలు, ముఖ్యంగా బచ్చలికూర (Spinach). ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ , సి ఉంటాయి. ఐరన్ లోపం వల్ల వచ్చే హెయిర్ లాస్‌ను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

చేపలు (Fatty Fish). సాల్మన్, మాకేరెల్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు తింటే.. మీ జుట్టు కుదుళ్లకు తగినంత మాయిశ్చరైజేషన్ అంది, జుట్టు సిల్కీగా మారుతుంది.

గింజలు, విత్తనాలు (Nuts and Seeds). బాదం పప్పులు, వాల్‌నట్స్, అలాగే గుమ్మడి గింజలు, అవిసె గింజలలో (Flaxseeds) విటమిన్ ఇ, జింక్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజూ గుప్పెడు నట్స్ తింటే స్కాల్ప్ హెల్త్ మెరుగుపడుతుంది.జుట్టు పెరగడానికి ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం లేదు. కేవలం మన వంటింట్లో, మన డైట్‌లో ఉండే పోషకాహారమే అసలైన మేజిక్ చేస్తుంది.

Tags:    

Similar News