ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త...సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
Chief Minister Revanth Reddy has issued a warning to employees who neglect their parents.;
ఎంతో ప్రేమతో బిడ్డలను కని.. కష్టపడి పెంచి.. విద్యాబుద్దులు నేర్పించి.. ప్రయోజకులుగా తీర్చిదిద్దన తల్లిదండ్రులకు.. వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టడానికి చాలా మందికి చేతులు రావడం లేదు. వయసుపైబడిన తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. తమకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం జీవితం ధారపోసిన కన్నవారికి కడుపునిండా అన్నం పెట్టడానికి కూడా మనసు రాని పాశాణ హృదయులు మన సమాజంలో కోకొల్లలు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ.. నెలకు లక్షల రూపాయల జీతం సంపాదించే వారు సైతం.. తల్లిదండ్రులను పట్టించుకోవాలంటే ఆసక్తి చూపడంలేదు. వారిని పెద్ద భారంగా భావిస్తున్నారు. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీతాల్లో కోత విధించేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగస్తులకు వార్నింగ్ ఇచ్చారు. వారి జీతాల్లో కొంత శాతం కట్ చేసి ఉద్యోగుల తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే విధంగా చూడాలని భావిస్తున్నారు. ఉద్యోగస్తుల జీతం నుంచి 10-15 శాతం కట్ చేసి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని సూచించారు.
ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అలానే ట్రాన్స్‌జెండర్లకు సంబంధించి కూడా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వారికి ట్రాఫిక్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ జాబితాను మరింత పెంచాలని.. రవాణా, ఆరోగ్యం, ఐటీ, ఎండోమెంట్, ప్రైవేటు రంగాల్లో కూడా ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో సంచలన సంఘటన వెలుగు చూసింది. తల్లిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన కుమారులకు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. తల్లిని పట్టించుకోని కుమారులు ఇంట్లో ఉండటానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. స్పందించకపోవడంతో.. ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన మలక్‌పేట మూసారాంబాగ్‌లో వెలుగు చూసింది. 90 ఏళ్ల వృద్ధురాలు శకుంతలా బాయి ఫిర్యాదుపై స్పందిస్తూ.. అధికారులు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇక అధికారుల చర్యలపై జనాలు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులు విషయంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ప్రశంసిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే..తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.