Gold Treasure Found at Former CIA Officer’s Residence: అమెరికా కేంద్ర గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)ను కూడా దోచేసిన మాజీ అధికారి ఒకరిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. డేవిడ్ రష్ అనే ఈ మాజీ సీఐఏ అధికారి ఇంట్లో ఒక్కోటి కేజీ బరువున్న 300 బంగారం బార్లు (బిస్కెట్లు)ను గుర్తించారు. వీటి విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 382 కోట్లు)గా అంచనా వేశారు.

అంతేకాకుండా అతని ఇంటి నుంచి 35 లగ్జరీ వాచ్‌లు (వీటిలో అధిక భాగం రోలెక్స్ మోడళ్లు), 20 లక్షల డాలర్ల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌బీఐ అధికారులు ఈ సమాచారాన్ని వెల్లడించారు.

ఉద్యోగ అవసరాల పేరుతో దోపిడీ:

డేవిడ్ రష్ సీఐఏలో పని చేస్తున్నప్పుడు 'ఉద్యోగ అవసరాలు' అని చెప్పి 2025-26 మధ్య కాలంలో ప్రభుత్వ నిధులతో భారీ మొత్తంలో బంగారం, నగదు తీసుకున్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది. అయితే ఆ మొత్తాన్ని అధికారికంగా ఉపయోగించకుండా రహస్యంగా తన ఇంట్లో దాచి పెట్టుకున్నాడని విచారణలో తేలింది. సీఐఏ మాత్రం ఈ ఖర్చుల వివరాలను వెల్లడించలేదు.

ఈ కేసులో రష్‌పై ప్రజాధనాన్ని దోచుకోవడం, మోసం చేయడం వంటి ఆరోపణలు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

నేవీలో కూడా అనుమానాలు:

రష్ 2015 వరకు అమెరికా నేవీలో పని చేశాడు. తాను పైలట్‌గా పని చేశానని చెప్పుకుంటుండగా, అతడు కేవలం రిజర్వ్ ఉద్యోగి మాత్రమేనని ఎఫ్‌బీఐ వెల్లడించింది. నేవీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐఏలో అతని ఖచ్చితమైన హోదా గురించి స్పష్టమైన సమాచారం లేదు.

వర్జీనియా రాష్ట్రంలోని అలెగ్జాండ్రియాలో ఈ కేసు విచారణ జరగనుంది. ఈ ఘటన నేపథ్యంలో సీఐఏ తన అంతర్గత ఖర్చులను సమీక్షించాలని నిర్ణయించింది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సంఘటన అమెరికా గూఢచార సంస్థల్లోని భద్రతా లోపాలను మరోసారి వెల్లడి చేసింది.

Tags: