ట్రంప్, మస్క్ ల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్...

Update: 2025-06-06 12:47 GMT
  • శక్తి మంతుడు వర్సెస్ బిగ్ బిలియనీర్..
  • నాడు మంచి మిత్రులు.. నేడు బద్ధశతృవులు
  • బహిరంగ వేదికలపై ఇద్దరూ తిట్ల పురాణం
  • ఒకరి బలహీనతలను మరొకరు ఎత్తి చూపుకుంటున్నారు
  • మకిలి కడుక్కుంటున్న అగ్ర నేతలు
  • ట్రంప్ అభిశంసనకు ఎలన్ మస్క్ ఉద్యమం
  • మస్క్ ఇమ్మిగ్రేషన్ కార్డు రద్దుకు ట్రంప్ మద్దతుదారుల పట్టు
  • అమెరికా మీడియాలో ఇద్దరూ అన్ పాపులర్
  • డైలీ సోప్ ఒపెరాను మించుతున్న బాగోతం..

ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య యుద్ధం పిల్లి, ఎలుక చెలగాటంలా తయారైంది.ఎలన్ మస్క్ తన పదవికి తానే సెగ పెట్టుకునేలా చేసిన ట్రంప్ ఇప్పుడు మస్క్ పై ఓపెన్ గా దేశాధిపతుల ముందే నోరు పారేసుకుంటున్నారు..జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తో మీటింగ్ లో ఎలన్ మస్క్ ను ఉద్దేశపూర్వకంగా విమర్శించడం చూస్తుంటే ఇప్పటికే తాను మస్క్ కోసం చాలా చేసినట్లు నోరుపారేసుకున్నారు. మస్క్ ఒంటి రంగును విమర్శించిన ట్రంప్ ఆతనికి మేకప్ అవసరం అంటూ నిష్టూరంగా మాట్లాడారు.తమ మధ్య గొడవకి ది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కానే కాదన్నారు. తన బిల్లు సంగతి ముందే తెలుసునని ఈవీ వెహికల్స్ పై సబ్సిడీలు ఎత్తేస్తున్నానని చెప్పినందుకు మస్క్ కు పౌరుషం పొడుచుకొచ్చిందని ఎద్దేవా చేశారు.ట్రంప్ చేసిన ఈ ఆరోపణలను ఖండించిన మస్క్ అన్నీ అబద్ధాలన్నీ ఈబిల్లు అసలు తనకు చూపించనేలేదని రాత్రికి రాత్రి దొడ్డి దారిన తీసుకొచ్చారని చెలరేగిపోయారు. ఇప్పుడిక ఇద్దరి మధ్యా యుద్ధం సోషల్ మీడియా వేదికలకి ఎక్కింది. ట్రంప్ గెలుపుకు తానే మార్గ నిర్దేశకుడినని తాను లేకపోతే అసలు గెలిచే వాడే కాదని తేల్చేశారు మస్క్. దీనికి ట్రంప్ ట్రూత్ మీడియా వేదికగా అసలు విషయం అదికాదు.. ఈవీ సబ్సిడీలు ఎత్తేసేసరికి పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నాడంటూ తిట్ల దండకం అందుకున్నారు.ఇక చాలు దయచేయమని తానెప్పుడో చెప్పేశానంటూ మరో మాట వదిలారు ట్రంప్.. ఇంకా హద్దు మీరితే కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని బెదిరించారు. హవ్వ.. అంతా అబద్ధం.. బిలియన్ల డాలర్లు నాకు సాయపడటమేంటి? అంతా రబ్బిష్ అంటూ కొట్టి పారేశారు మస్క్. మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ దొరికి పోయిన ఎపిస్టిన్ ఫైల్స్ లో ట్రంప్ ప్రమేయం ఉందంటూ మరో బాంబు పేల్చారు బిగ్ బిలియనీర్.అందుకే నిజా నిజాలు బయటకు రాకుండా తొక్కి పెట్టారంటూ ఆరోపించారు.ఆపై ట్రంప్ ను అభిశంసించాలంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ట్రంప్ ను తొలగించి ఆయన స్థానంలో జేడీ వాన్స్ ను అధ్యక్షుడిని చేయాలని ప్రతిపాదించారు. అసలు అమెరికాలో కొత్త పార్టీ అవసరం కనిపిస్తోంది. ఎంతమంది కొత్త పార్టీని సమర్ధిస్తారు. అమెరికా మధ్య తరగతి జీవుల ఆలోచనలేమిటి అని మరో ప్రశ్న సంధించారు మస్క్..

ట్రంప్,మస్క్ మధ్య యుద్ధం మీమ్స్ ద్వారా బాగా పబ్లిసిటీ అవుతోంది. టామ్, అండ్ జెర్రీ షో లాగా ఒకరిని ఒకరు ఇరికించుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ట్రంప్ తాజా నిర్ణయాల వల్లా, తాజా ఘర్షణల వల్ల టెస్లా కంపెనీ షేర్లు దారుణాతి దారుణంగా పడిపోయాయి. దాదాపు 150 బిలియన్ డాలర్ల సంపద పెట్టుబడి ఆవిరైపోయింది.ట్రంప్ నిర్ణయాల వల్ల అది 8 శాతానికి పడిపోయింది.మొత్తానికి ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని అంతర్గత బాగోతాలన్నీ బయటపెట్టుకుంటున్నారు.

ప్రపంచంలోకే తానొక బెస్ట్ డీలర్ నని వ్యాపారాలు, వ్యవహారాలు అద్భుతంగా నిర్వహిస్తానని ట్రంప్ కు ఒక భావన.మరి అంత గొప్ప వ్యవహార వేత్త ఎలన్ మస్క్ ని ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయారన్నది ప్రశ్న.అలాగే ప్రపంచంలోకే స్మార్టెస్ట్ ఎంటర్ ప్రెన్యుయర్గా తనను తాను భావించుకునే మస్క్ ట్రంప్ ముందు బోర్లాపడ్డారు. బోనులో చిక్కిన ఎలుకలా సంపదనంతా ఇక్కడ ట్రంప్ అర్పణం చేస్తున్నారు.తన వ్యాపార, వ్యవహార సరళితో ట్రంప్ ను మెప్పించి, ఒప్పించలేకపోయారు.

శక్తిమంతుడు వర్సెస్ కుబేరుడు

ఇక ఇద్దరి బాగోతాలు ఇప్పుడు పత్రికలకు ఎక్కుతున్నాయి. ట్రంప్ శిక్ష పడిన నిందితుడు.. తప్పుడు డాక్యుమెంట్లతో అడ్డగోలుగా ఆస్తులను సంపాదించిన ట్రంప్ ఆ ఆస్తులను ఒక పోర్న్ స్టార్ కు పోశారని కొన్నిచోట్ల రాస్తే, ఎలన్ మస్క్ డ్రగ్స్ కు బానిస అనీ.. తన వీర్యాన్ని అమ్ముకుని ప్రపంచ మంతా ఒకపెద్ద దండును తయారుచేసి దానికి తండ్రినంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని మరికొన్ని పత్రికలు రాశాయి.అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఖర్చుపెడుతూ ఒకరిపై ఒకరు బురద జల్లుకునే యుద్ధం మొదలు పెట్టారు. ఇద్దరి దగ్గరా అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల కుప్పలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోకే అత్యంత శక్తి మంతుడైన నేతకు, ప్రపంచ కుబేరుడికి మధ్య జరుగుతున్న యుద్ధం..అత్యంత సంక్లిష్టమైన ఈ యుద్ధం ఇప్పట్లో తేలేది కాదు.ఇద్దరూ కలిపి అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఈ యుద్ధం నుంచి మస్క్ తప్పుకుని పోదామనుకున్నా ట్రంప్ అంత సులభంగా వదలరు. ఇప్పటికే మస్క్ వ్యాపారాలన్నింటిపైనా దర్యాప్తు చేయాలంటూ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. మస్క్ ఇమ్మిగ్రేషన్ కార్డు చెక్ చేయాల్సిందేనని, అమెరికాలోకి అక్రమంగా మస్క్ ప్రవేశించారని యాగీ చేస్తున్నారు.మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో (MAGA)అమెరికాను దోచుకునేందుకు వచ్చిన గజ దొంగలన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బహిరంగ వేదికలపై ఒకరినొకరు తిట్టుకుంటూ మొత్తానికి చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నీ బయటపెట్టేసుకుంటున్నారు.ఒకళ్ల బురద ఒకళ్లు కడిగేసుకుంటున్నారు. యావత్ ప్రపంచం వారిని నిస్సిగ్గు చక్రవర్తుల్లా భావిస్తోంది.

Tags:    

Similar News